Wednesday, October 27, 2010
బాలయ్య బాబు పరమ వీర చక్ర డైలాగ్ లీకయిందొచ్!
పరమ వీర చక్ర సినిమా లో బాలయ్య బాబు సినీ హీరో పాత్ర పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అందులో హీరో పాత్ర కి, సినిమాలని పైరసీ చేసే విలన్ కి మధ్య సన్నివేశం లో డైలాగులు.
విలన్ (బాలయ్య ని ఉద్దేశించి) : సినిమాలని పైరసీ చేస్తే ఏమి చేస్తావు రా? కొడతావ, కొడతావా కొట్టు చూద్దాం.
విలన్ పక్కన కామెడి పాత్ర (కృష్ణ భగవాన్): ఏంటండి బాబు ఆయన్ని కొట్టండి, కొట్టండి అంటున్నారు? ఆయన సాధారణంగా కొట్టడు. కాని ఆయన కొట్టాడంటే ఓ రేంజ్ లో ఉంటుంది. బాలకృష్ణ అని పేరు చూసి చిన్ని కృష్ణుడు అనుకుంటున్నారేమో కొట్టడం మొదలెడితే ఆయన నాటు కృష్ణుడండి బాబు.
విలన్: వీడేదో ఆ రేంజ్ , ఓ రేంజ్ అంటున్నాడు. అసలేంటి రా నీ రేంజ్.
బాలయ్య బాబు: ఆరెంజ్, ఓ రేంజ్ అని మాట్లాడేంత చిన్న రేంజ్ కాదు రా నాది. (చిరు ఫామిలీ పై దాసరి సెటైర్) నేను ఏం చేసినా ఎక్కడ చేసినా రిజల్టు లో తేడా రాదు. సేం టూ సేం. నేను అక్కడ (సినిమాల్లో) కొడితే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది, రికార్డులు గల్లంతవుతాయి. ఇక్కడ కొడితే మీ బాక్ బద్దలవుతుంది. మీరు ఓటర్ల లిస్టులో గల్లంతవుతారు.
బాలయ్య బాబు (మళ్లీ విలన్ ని ఉద్దేశించి): పో , పో వెనక్కి తిరిగి వెళ్లి పో, వెనక్కి చూడకుండా వెళ్లి పో. మళ్లీ వెనక్కి తిరిగి చూసావో నీ జీవితం లో వెనక్కి తిరిగి చూసుకున్న ప్రతీ రోజు ఎందుకు తిరిగి చూసాను రా అని వెక్కి వెక్కి ఏడ్చేలా చేస్తాను.
పైన "ఆరెంజ్, ఓ రేంజ్ అని మాట్లాడేంత చిన్న రేంజ్ కాదు రా నాది". ఇది చూస్తుంటే చిరు ఫామిలీ పై దాసరి సెటైర్ వేసినట్టు ఉంది కదూ. బాలయ్య మరోసారి డైలాగులతో గాండ్రిస్తాడనుకుంటా..
1 comment:
adi gandrinchatam kaadu..moragatam....
Post a Comment