Pages

Monday, October 11, 2010

ముందు నువ్వు సిద్దం అవ్వు కే.సి.ఆర్...

http://www.eenadu.net/breakhtml.asp?qry=break38


తెలంగాణా ప్రజలు త్యాగాలకి సిద్దం కావాలి అని కే.సి.ఆర్ చేసిన స్టేట్మెంట్ తెలంగాణా వాడిని అయినా సరే నాకెందుకో నచ్చలేదు. ఎప్పుడు చంపడానికి, చావడానికి, ఆత్మార్పనలు చేసుకోవడానికి ప్రజలే సిద్దం కావాలా? రాజకీయ నాయకులు సిద్దం కాకుడదా? పార్టిలో అత్యున్నత హోదాలు అనుభవిస్తున్న వాళ్ళ కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, బావ మరుదులు సిద్దం అవకూడదా?
నాకు పెద్దగా విశ్లేషించి రాయడం రాదు కాబట్టి ఇంతకంటే ఎక్కువ రాయట్లేదు. నాకు అనిపించింది రాసాను అంతే. ఈ టపా చూసిన తర్వాత కొందరు నన్ను తిట్టొచ్చు, ఇంకొందరు సపోర్ట్ చేయోచ్చు. మరికొందరు గొడవ పడొచ్చు. కాని ఇలా మనలో మనం గొడవపడి కొట్టుకున్నన్ని రోజులు పోయేది మన పరువు, మన ప్రాణాలే తప్ప రాజకీయ నాయకులవి కాదు. వాళ్ళు మన జీవితాలతో ఇలా ఆడుకుంటూనే ఉంటారు.

గమనిక లేక హెచ్చరిక : ఎనానిమస్ లు పైన నాకు విశ్లేషించి రాయడం మాత్రమే రాదనీ చెప్పాను, కాని తెలుగు వాడిగా, తెలంగాణా వాడిగా నాకు అచ్చమైన తెలుగు బూతులన్నీ సరిగమపదనిసల తో సహా వచ్చు. కాబట్టి కామెంటేప్పుడు జాగ్రత్త.

7 comments:

Ganesh said...

బాబూ , త్యాగాలు అంటే చావటం కాదు నాన్నా.. కొన్ని రోజులు బందులు జరుగుతాయి.. దాని కోసం ముందు గా సిద్ధం గా ఉండమని.. మీ మీ పనులు పాడవుతాయి... జాగ్రత్త గా వ్యవహరించండి, ఏమైనా నష్టం కలిగితే పెద్ద మనసుతో క్షమించి త్యాగ గుణం చూపండి అని...

శ్రుతీకుమార్ said...

@గణేష్

ఇప్పుడున్న పరిస్థితుల్లో బంద్ లు ఏమైనా మనకు కొత్తా? వాటి వాళ్ళ వచ్చే నష్టం ఏమైనా కొత్తా? వాటిని పెద్ద త్యాగాలు అనుకోవడానికి. వాటిని రోజు మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా. కొంచం ఆలోచించండి మాష్టారు మీకే అర్థమవుతుంది కే.సి.ఆర్ మాటల్లోని ఆంతర్యం ఏంటో. అయినా ఏది జరిగినా నష్ట పోవలసింది మనమే కదా.

amma odi said...

Well said!

Alapati Ramesh Babu said...

మరీ అది గణెష్ లా కె.సి.ర్ ను సమర్ధించె వారు వుంటె ఆ మాటల మారిచిడు అగ్నిగుండం ఎమి ఖర్మ రావణాకాష్టం గూడ సరిపొని నిప్పు వెలిగించ గలడు. పాపం ఆమాయక ప్రజల చితి మంటల తొ వారు బాగు పడగలరు .

Anonymous said...

కాని ఇలా మనలో మనం గొడవపడి కొట్టుకున్నన్ని రోజులు పోయేది మన పరువు, మన ప్రాణాలే తప్ప రాజకీయ నాయకులవి కాదు
Chala Baagaa Cheppaaru.
Kaanee Meeru Chestunnadi Kooda Ade Kadaa.
Telangaanaa Vachche Varakannaa KCRni Manam Bharimchalema?
KCR ku Ippudu Pratyamnaya Nayakudu evaru?
-Yadgiri, Hyd

Anonymous said...

మీ గమనిక లేక హెచ్చరిక మాత్రం చాలా బాగుంది :)

శ్రుతీకుమార్ said...

@ ఎనానిమస్
కే.సి.ఆర్ ఉద్యమ నాయకుడి గా ఉన్నన్ని రోజులు ఉద్యమాన్ని తన రాజకీయ అవసరాల కోసం తప్పు గానే వాడుకుంటాడు. దాని వాళ్ళ మీరు కోరుకునే తెలంగాణా రాకపోవచ్చు. ఎప్పుడైతే కే.సి.ఆర్ ఈ ఉద్యమం నుండి తప్పుకుంటాడో అప్పుడే మనకు మంచి జరిగేది.

సోదర, సోదరిమణుల బ్లాగుల్లో చూస్తున్నాం కదండీ ఎనానిమస్ ల దాడులు. అందువల్లే అలా గమనిక లేక హెచ్చరిక పెట్టాల్సి వచ్చింది.

Post a Comment