ఇలా గొంతెత్తి గట్టిగా యాహూ...........అని అరవాలనుంది. ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుండి గజినీ లాగా దండయాత్రలు చేస్తున్నాను, కనీసం ఏ ఒక్క మార్కెటింగ్ జాబ్ అయినా సంవత్సరం పాటు కంటిన్యుగా చేద్దామని. అది ఈ రోజు తో కుదిరింది. విజయవంతంగా నేను ఈ జాబ్ లో చేరి సంవత్సరం. నాలుగు సంవత్సరాల్లో ఆరు ఉద్యోగాలు మారాను. జాబ్ వచ్చిందని చెప్పడమే తరువాయి ప్రతి ఒక్కడు అడగడమే కనీసం దీంట్లో ఐనా సంవత్సరం చేస్తావా అని. ఇంతకు ముందొకసారి సచిన్ కి ఒక్క పరుగుతో సెంచరి మిస్ ఐనట్టు, నేను ఇంకో మూడు రోజుల్లో సంవత్సరం పూర్తి అవుతుందనగా రిజైన్ చేసాను. కారణాలు అడక్కండి చాలా ఉన్నాయి. అందులో నా బలుపు కూడా ఒకటి. ఏదైతే ఏంటి? అప్పటి నుండి ట్రై చేస్తే ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు చాలా కాకపోయినా కొంచం హ్యాపీ గానే ఉన్నాను. కాని చిన్న ట్విస్ట్. త్వరలో ఈ జాబ్ కూడా రిజైన్ చేయాల్సి వస్తుంది. రీజన్ మళ్లీ అదే అనుకోండి. నెక్స్ట్ మళ్లీ ఎక్కడో....ఎప్పుడో.......అంతా మార్కెటింగ్ జాబ్ మహిమ.
5 comments:
చాలా మంది మార్కెటింగ్ ఉద్యోగాలు చేసే వాళ్ళు చేసేపనే మీరూ చేస్తున్నారు కనీ అది సరైన పద్ధతి కాదు
మీకు ఎక్కడ సరైన అనుభవం రికార్డ్ అవదు పైగా అదో బేడ్ మార్క్ కూడా ఇంకా చాలా విషయాలు వున్నాయి ఈ కామెంట్ లో రాయ లేనివి.
మార్కెటింగ్ పెర్సనల్ లో ముఖ్య విషయం ఎగో ని తగ్గించు కోవటం మీరన్న బలుపు మీ అభివృధి కి అడ్డం కాకుండా చూస్కోండి
అల్ ది బెస్ట్
:) Ur life, Ur profession, Ur wish.
Do how ever you like.
Good luck.
"Change is the essence of Life."
I too a sales guy;I dont think there is any problem in changing job particulary in our field.
Go ahead Bro & All the best
Thank you for your valuable suggestions guys.
:))ALL THE BEST
...ముందటి పోస్టులో ఫొటో భలే పట్టావ్
Post a Comment