
దీనమ్మ..... తొక్కలో వెబ్ కౌన్సిలింగ్. నా గర్ల్ ఫ్రెండ్ కి ఫస్ట్ ఫేస్ లో గుంటూరు లొ వచ్చిందని హైదరాబాద్ కి దూరం అవుతుందని, సెకండ్ ఫేస్ అప్లై చేయిస్తే ఈ సారి అంతకంటే దూరం అనంతపురం లొ వచ్చింది. జర్నీ కే సగం రోజు గడిచి పోతుంది. అసలే నా గర్ల్ ఫ్రెండ్ చాలా మంచిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రీచార్జులు చేయించేది. అడిగినప్పుడల్లా డబ్బులిచ్చేది. సినిమాలకి, షికార్లకి, కాఫీ షాపులకి వెళ్తే బిల్ తనే పే చేసేది. రీసెంట్ గా నెక్స్ట్ మీట్ లొ తులం గోల్డ్ చెయిన్ కూడా ఇస్తానంది. మీరే చెప్పండి ఈ కాలం లో అలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరకడం ఎంత కష్టమో. మరి అలాంటి తనకి దూరం గా ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుంది.
అసలు నాకు కలిగిన కష్టాన్ని, నష్టాన్ని ఎవరు భరించాలి. ఈ విద్యా శాఖ, దాని వెనకున్న ఈ ప్రభుత్వం భరిస్తుందా...అని కోశ్నిస్తున్నాను. అందుకే కామ్రేడ్స్ మన లాంటి గర్ల్ ఫ్రెండ్ ని దూరం చేసుకున్న వాళ్ళంతా ఏకమై పోరాటం చేయాలి. దానికి మార్తాండ నాయకత్వం వహించాలి. ప్ర.పి. స.స వాళ్ళు దానికి సపోర్ట్ చేయాలి. కె.బ్లా.స వాళ్ళు దాన్ని కెలకాలి. అలా మనకు ఫ్రీ పబ్లిసిటి వచ్చి మన ముఖ్యమంత్రి రోశయ్యని సోనియా గాంధి దించేసి మార్తాండ ని ముఖ్యమంత్రి ని చేయాలి. "జై బోలో" మన తొక్కలో వెబ్ కౌన్సిలింగ్ ఉద్యమానికి.
అయ్య బాబోయ్... ఏంటి రాతలు? గర్ల్ ఫ్రెండ్ దూరం అవుతుందనే బాధ లో నాకేదో అవుతున్నట్టుంది. నన్ను రక్షించండి బాబోయ్...... అయినా మన రాత ఇలా ఉంటే ఎవరేం చేస్తారు లెండి. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. తను మళ్లీ సంక్రాంతి కి కాని కలవదు. అంత వరకు వేరే గర్ల్ ఫ్రెండ్ ని వెదుక్కోవాలి. ఎంతైనా అలవాటైన ప్రాణం కదండీ. వెళ్ళొస్తా మరి. బై.బై..........
4 comments:
నీ గర్ల్ ఫ్రెండ్ అడ్రెస్ చెప్పవోయ్, సుబ్బారావ్
@ ఎనానిమస్
మీ చెల్లి అడ్రస్సు చెప్పడానికి కొంచం ఖర్చవుద్ది బామ్మర్ది.
miku inta chinna girl friend aa? aa ammayi daggara nijamgaane dabbulu tisukuntaara..
miru rasinavanni nijamena? saradaki ala rastunnara?
@ జాబిలీ
కొంత నిజం, కొంత సరదా.........
Post a Comment