Pages

Tuesday, October 12, 2010

చిరూ... "కొంచం డైలాగ్ చేంజ్ చెయ్... గురూ"


"అసలు రాష్ట్రం లో పాలన అనేది ఉందా"? అని నువ్ మొదటి సారి ప్రశ్నించినపుడు నిజంగానే మా అందరి తరుపునా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావ్ అనుకున్నా. కాని నువ్ ఊరికెళ్ళినా, సభ లో ప్రసంగించినా, సమస్య గురించి మాట్లాడినా పదే పదే ప్రశ్నే అడుగుతుంటే అసలు నీకు నిజంగానే రాజకీయాలు తెలియక, రాష్ట్రం లో జరుగుతున్నది అర్థం కాక నీ సందేహ నివృత్తి కోసం తికమక పడుతూ, బుర్ర గోక్కుంటూ "అసలు రాష్ట్రం లో పాలన అనేది ఉందా"? అని మమ్మల్ని అడుగుతున్నావని ఇప్పుడు అర్థం అవుతుంది.

అదేదో "పరుగో పరుగు" అనే రాజేంద్ర ప్రసాద్ సినిమా లో, క్లైమాక్స్ ద్రౌపది వస్త్రాపహరణం సీన్ లో అనుకుంటా ఒక కారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు డైలాగ్ చెప్పినా కాళ్ళు కింద భూమికేసి టప టప కొడుతూ "ఇదియే మన తక్షణ కర్తవ్యము,ఇదియే మన తక్షణ కర్తవ్యము"అని చంకలు గుద్దుకుంటూ ఉంటాడు. "అసలు రాష్ట్రం లో పాలన అనేది ఉందా"? అని నువ్ అడిగినపుడల్లా నాకు సీనే గుర్తుకు వచ్చి తెగ నవ్వొచ్చేస్తుంది.

అందుకే చిరూ ఇప్పటికైనా కొంచం డైలాగ్ చేంజ్ చెయ్....గురూ.

3 comments:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

You are right,boss.

jaggampeta said...

photo baaga select chesavu

Anonymous said...

"అసలు ఈ రాష్ట్రం లో పాలన అనేది ఉందా" అని ఓ ప్రక్క ప్రశ్నిస్తూ మరో పక్క బంగారమ్మో, కాశయ్యో ఈలేస్తే కుక్కలాగా తోక ఊపుకుంటూ వెళ్ళి "పాలనలో కలుద్దాం" అనుకోవటం గురించి వ్రాయటం మర్చిపోయినట్ట్లున్నారు!!

Post a Comment