Pages

Tuesday, August 31, 2010

నా జ్ఞాపకాలు-1

"ప్లీజ్ నన్ను మరచి పో"
"నేను ఎపుడు చనిపోతానో నాకు తెలియదు"
" రోజు తో నాకు రేపు అనేది ఉండకపోవచ్చు"
"ఇన్ని రోజులు నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించు"
"బై ఫర్ ఎవర్ బబ్బు"
ఇట్లు
యువర్స్
Sru.....................

రోజు మార్నింగ్ నుంచి అసలు ఏమి అర్థం కావట్లేదు, ఏమి తోచట్లేదు నాకు. ఏదో చేయాలనిపిస్తుంది. కాని ఏది చేయలేని పరిస్థితి నాది. అలా అని ఊరుకోలేను.......
అసలు నేను ఇలా అవడానికి కారణం ఉదయం నాకొచ్చిన పై మెసేజ్.........
ఇలాంటి మెసేజెస్ రావడం నాకు కొత్తేమి కాదు......
కాని మెసేజ్ లో ఏదో తెలియని స్ట్రాంగ్ నెస్ ఉంది......

నా పరిస్థితి వెనక ఇరవై ఐదు సంవత్సరాల ఒక అలవాటు, ఒక వ్యసనం ఉంది. అదే "తప్పు చేయటం". నాకు తెలిసి తప్పు చేయటం పెద్ద తప్పు కాదు, పెద్ద వ్యసనము కాదు. కాని "తప్పు అని తెలిసి కూడా తప్పు చేయటం" చాలా పెద్ద తప్పు , చెప్పాలంటే అంత కంటే చెడు వ్యసనం ఇంకొకటి లేదు. కాని ఇరవై నాలుగు సంవత్సరాల వయసు లో దీనికి సరి సమానమైన మరో చెడు వ్యసనం నా జత చేరింది. దాని పేరే "ప్రేమ". రెండు వ్యసనాలు జత కలిస్తే అదే నేను ఇప్పుడున్న పరిస్థితి.

నాకు ఇప్పటికి గుర్తు రోజు..........................
మార్చి 12, 2009.............

ఇంటికెల్లాలంటే ఎపుడైనా ఆనందం తో ఎగిరి గంతేసే నేను మొదటి సారి ఇష్టం లేకుండా బయలు దేరుతున్నాను. అప్పటికి నేను రాను అనే చెప్పాను. అందరు వెళ్లి పోయినా చివరి క్షణం వరకు వెళ్ళకుండా అలానే ఉండి పోయాను. కాని సడెన్ గా గోదావరిఖని నుండి "ధర్మెంధర్" గాడి ఫోన్. పెళ్లి కొడుకు పెళ్లి బట్టలు అన్ని హైదరాబాద్ లోనే ఉన్నాయ్, ప్రస్తుతానికి హైదరాబాద్ లో నువ్వొక్కడివే ఉన్నావ్, అర్జెంటు గా తీసుకుని బయలుదేరమని. తెల్లవారితే ధర్మెంధర్ గాడి అన్నయ్య పెళ్లి.

మీకు ధర్మెంధర్ గురించి చెప్పలేదు కదూ. వాడు నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇరవై మూడు సంవత్సరాల వరకు నా వన్ అండ్ ఓన్లి బెస్ట్ ఫ్రెండ్. ఇరవై మూడు సంవత్సరాల నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు ఓన్లీ రూం మేట్. ప్రస్తుతం వాడు నాకు ఏమి కాడు.

నేను పెళ్లి బట్టలని రిసీవ్ చేసుకుని హైదరాబాద్ ఇమ్లిబన్ లో బస్ ఎక్కాను. కాని నాకో మా చెడ్డ అలవాటుంది ప్రయాణం చేసేపుడు. నాకు నచ్చిన వాళ్ళని మాత్రమే నా పక్క సీట్లో కూర్చోనిస్తా.....

చిన్న సీటే నా లైఫ్ లో పెద్ద ట్విస్ట్ అవుతుందని నేను రోజు ఊహించలేదు.................

To be continued..........................