Pages

Monday, November 15, 2010

"hands burning leaves catching" "ఏం చేస్తం.....ఖండిస్తం"




చెబితే విన్నాను కాదు తాగి బస్ ఎక్కోద్దురా అంటే, తాగి బండి నడిపితే ప్రాబ్లం కాని బస్ ఎక్కితే ఏం ప్రాబ్లం అనుకుని పైన ఫోసు లో రెండు బీర్లు ఫుల్ గా పట్టించి హైదరాబాద్ నుండి పూణే వెళ్ళడానికి బస్ ఎక్కాను. కరెక్ట్ గా మందు మైండ్ కి ఎక్కినపుడు వచ్చిందండి......... వచ్చింది పూణే కాదు, ఎప్పుడు పూనకం వచ్చినట్టుండే నా గాళ్ ఫ్రెండ్ నుంచి ఫోన్. అసలేం మాట్లాడానో, ఏం అన్నానో కూడా గుర్తుకు లేదు. తెల్లవారి నుండి మాత్రం నో కాల్. నో మెసేజ్. ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. తన ఫ్రెండ్ చేత చెప్పించింది జీవితం లో మరొక సారి కాల్ చేయొద్దని. ఆ రోజు తాగి అలా మాట్లాడాను అని చెబుదామనుకున్నా. కాని అది ఇంత కంటే డేంజర్. నార్మల్ గా ఇప్పుడైతే మాట్లాడకుండా వదిలేసింది. అదే నేను తాగానని తెలిస్తే కచ్చితంగా చంపేస్తుంది. ఏది ఏమైతే ఏంటి? "hands burning leaves catching". మొత్తానికి మనకి దెబ్బడి పోయింది. ఇప్పుడు అనుకుని ఏం చేస్తాం?

ఏం చేస్తాం.........గాయం లో కోట శ్రీనివాసరావు అన్నట్టు "ఏం చేస్తం.....ఖండిస్తం".