Pages

Friday, October 29, 2010

గెట్టింగ్ బోర్......నీడ్ రిఫ్రెష్ మెంట్



నాకు కొంచం రిఫ్రెష్మెంట్ కావాలి. సో... దీపావళి కి హైదరాబాద్ రావాలనుకుంటున్నాను. అందుకే ఎన్ని రోజులో తెలియదు కాని కొన్ని రోజులు మాత్రం సెలవు.

Wednesday, October 27, 2010

బాలయ్య బాబు పరమ వీర చక్ర డైలాగ్ లీకయిందొచ్!




పరమ
వీర చక్ర సినిమా లో బాలయ్య బాబు సినీ హీరో పాత్ర పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అందులో హీరో పాత్ర కి, సినిమాలని పైరసీ చేసే విలన్ కి మధ్య సన్నివేశం లో డైలాగులు.

విలన్ (బాలయ్య ని ఉద్దేశించి) : సినిమాలని పైరసీ చేస్తే ఏమి చేస్తావు రా? కొడతావ, కొడతావా కొట్టు చూద్దాం.
విలన్ పక్కన కామెడి పాత్ర (కృష్ణ భగవాన్): ఏంటండి బాబు ఆయన్ని కొట్టండి, కొట్టండి అంటున్నారు? ఆయన సాధారణంగా కొట్టడు. కాని ఆయన కొట్టాడంటే ఓ రేంజ్ లో ఉంటుంది. బాలకృష్ణ అని పేరు చూసి చిన్ని కృష్ణుడు అనుకుంటున్నారేమో కొట్టడం మొదలెడితే ఆయన నాటు కృష్ణుడండి బాబు.

విలన్: వీడేదో ఆ రేంజ్ , ఓ రేంజ్ అంటున్నాడు. అసలేంటి రా నీ రేంజ్.

బాలయ్య బాబు: ఆరెంజ్, ఓ రేంజ్ అని మాట్లాడేంత చిన్న రేంజ్ కాదు రా నాది. (చిరు ఫామిలీ పై దాసరి సెటైర్) నేను ఏం చేసినా ఎక్కడ చేసినా రిజల్టు లో తేడా రాదు. సేం టూ సేం. నేను అక్కడ (సినిమాల్లో) కొడితే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది, రికార్డులు గల్లంతవుతాయి. ఇక్కడ కొడితే మీ బాక్ బద్దలవుతుంది. మీరు ఓటర్ల లిస్టులో గల్లంతవుతారు.

బాలయ్య బాబు (మళ్లీ విలన్ ని ఉద్దేశించి): పో , పో వెనక్కి తిరిగి వెళ్లి పో, వెనక్కి చూడకుండా వెళ్లి పో. మళ్లీ వెనక్కి తిరిగి చూసావో నీ జీవితం లో వెనక్కి తిరిగి చూసుకున్న ప్రతీ రోజు ఎందుకు తిరిగి చూసాను రా అని వెక్కి వెక్కి ఏడ్చేలా చేస్తాను.

పైన "ఆరెంజ్, రేంజ్ అని మాట్లాడేంత చిన్న రేంజ్ కాదు రా నాది". ఇది చూస్తుంటే చిరు ఫామిలీ పై దాసరి సెటైర్ వేసినట్టు ఉంది కదూ. బాలయ్య మరోసారి డైలాగులతో గాండ్రిస్తాడనుకుంటా..

Monday, October 25, 2010

నో ఇమేజ్ బట్ థియేటర్ ఫుల్



ఈ రోజు పొద్దున్నే మా స్నేహితుడొకడు ప్రశ్నో, పొడుపు కథో నాకు తెలియలేదు కాని వాడైతే ఒకటి అడిగాడు. ఏ ఇమేజ్ లేని హీరో, హీరొయిన్లని పెట్టి పేరు లేని బానర్ల లో ఏ చెత్త దర్శకుడు తీసినా మొదటి రోజే మొదటి షో తోనే థియేటర్ ఫుల్ అయ్యే సినీమాలు ఏంటి రా? అని. కొద్దిసేపు ఆలోచించి బుర్ర పాడు చేసుకున్నాను. కాని తర్వాత తట్టింది. దీనికి సమాధానం మన బ్లాగు లోకం లో ఎంత మంది చెబుతారో అని ఈ టపా పెడుతున్నాను.

చూద్దాం ఎంత మందికి సినిమా నాలెడ్జ్ ఉందొ........

Friday, October 22, 2010

దీనమ్మ..... తొక్కలో వెబ్ కౌన్సిలింగ్


దీనమ్మ..... తొక్కలో వెబ్ కౌన్సిలింగ్. నా గర్ల్ ఫ్రెండ్ కి ఫస్ట్ ఫేస్ లో గుంటూరు లొ వచ్చిందని హైదరాబాద్ కి దూరం అవుతుందని, సెకండ్ ఫేస్ అప్లై చేయిస్తే ఈ సారి అంతకంటే దూరం అనంతపురం లొ వచ్చింది. జర్నీ కే సగం రోజు గడిచి పోతుంది. అసలే నా గర్ల్ ఫ్రెండ్ చాలా మంచిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రీచార్జులు చేయించేది. అడిగినప్పుడల్లా డబ్బులిచ్చేది. సినిమాలకి, షికార్లకి, కాఫీ షాపులకి వెళ్తే బిల్ తనే పే చేసేది. రీసెంట్ గా నెక్స్ట్ మీట్ లొ తులం గోల్డ్ చెయిన్ కూడా ఇస్తానంది. మీరే చెప్పండి ఈ కాలం లో అలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరకడం ఎంత కష్టమో. మరి అలాంటి తనకి దూరం గా ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుంది.

అసలు
నాకు కలిగిన కష్టాన్ని, నష్టాన్ని ఎవరు భరించాలి. ఈ విద్యా శాఖ, దాని వెనకున్న ఈ ప్రభుత్వం భరిస్తుందా...అని కోశ్నిస్తున్నాను. అందుకే కామ్రేడ్స్ మన లాంటి గర్ల్ ఫ్రెండ్ ని దూరం చేసుకున్న వాళ్ళంతా ఏకమై పోరాటం చేయాలి. దానికి మార్తాండ నాయకత్వం వహించాలి. ప్ర.పి. స.స వాళ్ళు దానికి సపోర్ట్ చేయాలి. కె.బ్లా.స వాళ్ళు దాన్ని కెలకాలి. అలా మనకు ఫ్రీ పబ్లిసిటి వచ్చి మన ముఖ్యమంత్రి రోశయ్యని సోనియా గాంధి దించేసి మార్తాండ ని ముఖ్యమంత్రి ని చేయాలి. "జై బోలో" మన తొక్కలో వెబ్ కౌన్సిలింగ్ ఉద్యమానికి.

అయ్య
బాబోయ్... ఏంటి రాతలు? గర్ల్ ఫ్రెండ్ దూరం అవుతుందనే బాధ లో నాకేదో అవుతున్నట్టుంది. నన్ను రక్షించండి బాబోయ్...... అయినా మన రాత ఇలా ఉంటే ఎవరేం చేస్తారు లెండి. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. తను మళ్లీ సంక్రాంతి కి కాని కలవదు. అంత వరకు వేరే గర్ల్ ఫ్రెండ్ ని వెదుక్కోవాలి. ఎంతైనా అలవాటైన ప్రాణం కదండీ. వెళ్ళొస్తా మరి. బై.బై..........

Thursday, October 21, 2010

అంతా మార్కెటింగ్ జాబ్ మహిమ.




ఇలా గొంతెత్తి గట్టిగా యాహూ...........అని అరవాలనుంది. ఎందుకంటే నాలుగు సంవత్సరాల నుండి గజినీ లాగా దండయాత్రలు చేస్తున్నాను, కనీసం ఒక్క మార్కెటింగ్ జాబ్ అయినా సంవత్సరం పాటు కంటిన్యుగా చేద్దామని. అది రోజు తో కుదిరింది. విజయవంతంగా నేను జాబ్ లో చేరి సంవత్సరం. నాలుగు సంవత్సరాల్లో ఆరు ఉద్యోగాలు మారాను. జాబ్ వచ్చిందని చెప్పడమే తరువాయి ప్రతి ఒక్కడు అడగడమే కనీసం దీంట్లో ఐనా సంవత్సరం చేస్తావా అని. ఇంతకు ముందొకసారి సచిన్ కి ఒక్క పరుగుతో సెంచరి మిస్ ఐనట్టు, నేను ఇంకో మూడు రోజుల్లో సంవత్సరం పూర్తి అవుతుందనగా రిజైన్ చేసాను. కారణాలు అడక్కండి చాలా ఉన్నాయి. అందులో నా బలుపు కూడా ఒకటి. ఏదైతే ఏంటి? అప్పటి నుండి ట్రై చేస్తే ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు చాలా కాకపోయినా కొంచం హ్యాపీ గానే ఉన్నాను. కాని చిన్న ట్విస్ట్. త్వరలో జాబ్ కూడా రిజైన్ చేయాల్సి వస్తుంది. రీజన్ మళ్లీ అదే అనుకోండి. నెక్స్ట్ మళ్లీ ఎక్కడో....ఎప్పుడో.......అంతా మార్కెటింగ్ జాబ్ మహిమ.

Tuesday, October 12, 2010

చిరూ... "కొంచం డైలాగ్ చేంజ్ చెయ్... గురూ"


"అసలు రాష్ట్రం లో పాలన అనేది ఉందా"? అని నువ్ మొదటి సారి ప్రశ్నించినపుడు నిజంగానే మా అందరి తరుపునా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావ్ అనుకున్నా. కాని నువ్ ఊరికెళ్ళినా, సభ లో ప్రసంగించినా, సమస్య గురించి మాట్లాడినా పదే పదే ప్రశ్నే అడుగుతుంటే అసలు నీకు నిజంగానే రాజకీయాలు తెలియక, రాష్ట్రం లో జరుగుతున్నది అర్థం కాక నీ సందేహ నివృత్తి కోసం తికమక పడుతూ, బుర్ర గోక్కుంటూ "అసలు రాష్ట్రం లో పాలన అనేది ఉందా"? అని మమ్మల్ని అడుగుతున్నావని ఇప్పుడు అర్థం అవుతుంది.

అదేదో "పరుగో పరుగు" అనే రాజేంద్ర ప్రసాద్ సినిమా లో, క్లైమాక్స్ ద్రౌపది వస్త్రాపహరణం సీన్ లో అనుకుంటా ఒక కారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు డైలాగ్ చెప్పినా కాళ్ళు కింద భూమికేసి టప టప కొడుతూ "ఇదియే మన తక్షణ కర్తవ్యము,ఇదియే మన తక్షణ కర్తవ్యము"అని చంకలు గుద్దుకుంటూ ఉంటాడు. "అసలు రాష్ట్రం లో పాలన అనేది ఉందా"? అని నువ్ అడిగినపుడల్లా నాకు సీనే గుర్తుకు వచ్చి తెగ నవ్వొచ్చేస్తుంది.

అందుకే చిరూ ఇప్పటికైనా కొంచం డైలాగ్ చేంజ్ చెయ్....గురూ.

Monday, October 11, 2010

ముందు నువ్వు సిద్దం అవ్వు కే.సి.ఆర్...

http://www.eenadu.net/breakhtml.asp?qry=break38


తెలంగాణా ప్రజలు త్యాగాలకి సిద్దం కావాలి అని కే.సి.ఆర్ చేసిన స్టేట్మెంట్ తెలంగాణా వాడిని అయినా సరే నాకెందుకో నచ్చలేదు. ఎప్పుడు చంపడానికి, చావడానికి, ఆత్మార్పనలు చేసుకోవడానికి ప్రజలే సిద్దం కావాలా? రాజకీయ నాయకులు సిద్దం కాకుడదా? పార్టిలో అత్యున్నత హోదాలు అనుభవిస్తున్న వాళ్ళ కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, బావ మరుదులు సిద్దం అవకూడదా?
నాకు పెద్దగా విశ్లేషించి రాయడం రాదు కాబట్టి ఇంతకంటే ఎక్కువ రాయట్లేదు. నాకు అనిపించింది రాసాను అంతే. ఈ టపా చూసిన తర్వాత కొందరు నన్ను తిట్టొచ్చు, ఇంకొందరు సపోర్ట్ చేయోచ్చు. మరికొందరు గొడవ పడొచ్చు. కాని ఇలా మనలో మనం గొడవపడి కొట్టుకున్నన్ని రోజులు పోయేది మన పరువు, మన ప్రాణాలే తప్ప రాజకీయ నాయకులవి కాదు. వాళ్ళు మన జీవితాలతో ఇలా ఆడుకుంటూనే ఉంటారు.

గమనిక లేక హెచ్చరిక : ఎనానిమస్ లు పైన నాకు విశ్లేషించి రాయడం మాత్రమే రాదనీ చెప్పాను, కాని తెలుగు వాడిగా, తెలంగాణా వాడిగా నాకు అచ్చమైన తెలుగు బూతులన్నీ సరిగమపదనిసల తో సహా వచ్చు. కాబట్టి కామెంటేప్పుడు జాగ్రత్త.