Pages

Thursday, March 31, 2011

ఎలా రాయాలి?






నేను ఒక స్టోరీ రాయాలనుకుంటున్నాను. కాని నాకు ఎలా మొదలు పెట్టాలి, అసలు ఎలా రాయాలి కథని అనేది తెలియట్లేదు. నా దగ్గర రా మెటీరియల్ ఉంది, బట్ దాన్ని ఒక ప్రోడక్ట్ గా మార్చే విధానం నాకు తెలియదు. సో మీ దగ్గర స్టోరీ రైటింగ్ టిప్స్ ఏమైనా ఉంటే నాకు సలహాలు ఇవ్వగలరు.

Saturday, December 4, 2010

My love is gone.............




అంతా అనుకున్నట్టే జరిగింది...........నా లవ్ మొత్తానికే దెబ్బ తింది.........

its gone..............

Monday, November 15, 2010

"hands burning leaves catching" "ఏం చేస్తం.....ఖండిస్తం"




చెబితే విన్నాను కాదు తాగి బస్ ఎక్కోద్దురా అంటే, తాగి బండి నడిపితే ప్రాబ్లం కాని బస్ ఎక్కితే ఏం ప్రాబ్లం అనుకుని పైన ఫోసు లో రెండు బీర్లు ఫుల్ గా పట్టించి హైదరాబాద్ నుండి పూణే వెళ్ళడానికి బస్ ఎక్కాను. కరెక్ట్ గా మందు మైండ్ కి ఎక్కినపుడు వచ్చిందండి......... వచ్చింది పూణే కాదు, ఎప్పుడు పూనకం వచ్చినట్టుండే నా గాళ్ ఫ్రెండ్ నుంచి ఫోన్. అసలేం మాట్లాడానో, ఏం అన్నానో కూడా గుర్తుకు లేదు. తెల్లవారి నుండి మాత్రం నో కాల్. నో మెసేజ్. ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. తన ఫ్రెండ్ చేత చెప్పించింది జీవితం లో మరొక సారి కాల్ చేయొద్దని. ఆ రోజు తాగి అలా మాట్లాడాను అని చెబుదామనుకున్నా. కాని అది ఇంత కంటే డేంజర్. నార్మల్ గా ఇప్పుడైతే మాట్లాడకుండా వదిలేసింది. అదే నేను తాగానని తెలిస్తే కచ్చితంగా చంపేస్తుంది. ఏది ఏమైతే ఏంటి? "hands burning leaves catching". మొత్తానికి మనకి దెబ్బడి పోయింది. ఇప్పుడు అనుకుని ఏం చేస్తాం?

ఏం చేస్తాం.........గాయం లో కోట శ్రీనివాసరావు అన్నట్టు "ఏం చేస్తం.....ఖండిస్తం".

Friday, October 29, 2010

గెట్టింగ్ బోర్......నీడ్ రిఫ్రెష్ మెంట్



నాకు కొంచం రిఫ్రెష్మెంట్ కావాలి. సో... దీపావళి కి హైదరాబాద్ రావాలనుకుంటున్నాను. అందుకే ఎన్ని రోజులో తెలియదు కాని కొన్ని రోజులు మాత్రం సెలవు.

Wednesday, October 27, 2010

బాలయ్య బాబు పరమ వీర చక్ర డైలాగ్ లీకయిందొచ్!




పరమ
వీర చక్ర సినిమా లో బాలయ్య బాబు సినీ హీరో పాత్ర పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అందులో హీరో పాత్ర కి, సినిమాలని పైరసీ చేసే విలన్ కి మధ్య సన్నివేశం లో డైలాగులు.

విలన్ (బాలయ్య ని ఉద్దేశించి) : సినిమాలని పైరసీ చేస్తే ఏమి చేస్తావు రా? కొడతావ, కొడతావా కొట్టు చూద్దాం.
విలన్ పక్కన కామెడి పాత్ర (కృష్ణ భగవాన్): ఏంటండి బాబు ఆయన్ని కొట్టండి, కొట్టండి అంటున్నారు? ఆయన సాధారణంగా కొట్టడు. కాని ఆయన కొట్టాడంటే ఓ రేంజ్ లో ఉంటుంది. బాలకృష్ణ అని పేరు చూసి చిన్ని కృష్ణుడు అనుకుంటున్నారేమో కొట్టడం మొదలెడితే ఆయన నాటు కృష్ణుడండి బాబు.

విలన్: వీడేదో ఆ రేంజ్ , ఓ రేంజ్ అంటున్నాడు. అసలేంటి రా నీ రేంజ్.

బాలయ్య బాబు: ఆరెంజ్, ఓ రేంజ్ అని మాట్లాడేంత చిన్న రేంజ్ కాదు రా నాది. (చిరు ఫామిలీ పై దాసరి సెటైర్) నేను ఏం చేసినా ఎక్కడ చేసినా రిజల్టు లో తేడా రాదు. సేం టూ సేం. నేను అక్కడ (సినిమాల్లో) కొడితే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది, రికార్డులు గల్లంతవుతాయి. ఇక్కడ కొడితే మీ బాక్ బద్దలవుతుంది. మీరు ఓటర్ల లిస్టులో గల్లంతవుతారు.

బాలయ్య బాబు (మళ్లీ విలన్ ని ఉద్దేశించి): పో , పో వెనక్కి తిరిగి వెళ్లి పో, వెనక్కి చూడకుండా వెళ్లి పో. మళ్లీ వెనక్కి తిరిగి చూసావో నీ జీవితం లో వెనక్కి తిరిగి చూసుకున్న ప్రతీ రోజు ఎందుకు తిరిగి చూసాను రా అని వెక్కి వెక్కి ఏడ్చేలా చేస్తాను.

పైన "ఆరెంజ్, రేంజ్ అని మాట్లాడేంత చిన్న రేంజ్ కాదు రా నాది". ఇది చూస్తుంటే చిరు ఫామిలీ పై దాసరి సెటైర్ వేసినట్టు ఉంది కదూ. బాలయ్య మరోసారి డైలాగులతో గాండ్రిస్తాడనుకుంటా..