Pages

Monday, September 27, 2010

నో గాడ్, ఓన్లీ ఎయిర్ టెల్

దేవుడికి గట్టి....గా వినపడేట్టు " మై గాడ్, ఏంటీ పరీక్ష నాకు?" అని అరవాలని ఉంది నాకు. కాని అరవలేను, ఎందుకంటే జలుబు చేసి గొంతు బొంగురు పోయింది? అందుకే ఇలా బ్లాగులో అరుస్తున్నాను, రాస్తున్నాను. అసలు విషయం ఏంటి అంటే అదో చిన్న ప్రేమ కథ......అందుకే ఒక ఐదారు ముక్కల్లో చెప్పేస్తా.

మేమిద్దరం గోదావరిఖని లో ఉండేవాళ్ళం. కాని అపుడు మాకు పరిచయం లేదు.........
ఫోన్ లో పరిచయం అయ్యాక తను జమ్మికుంట నేను హైదరాబాద్.........
మా పరిచయం కాస్తా స్నేహం అయ్యాక నేను తమిళనాడు తను హైదరాబాద్.........
మా స్నేహం ప్రేమ అయ్యేసరికి నేను హైదరాబాద్ వస్తున్నాను, తను చదువు కోసం గుంటూరు వెళ్ళిపోతుంది.....

తొక్కలోది చెప్పాలంటే నాకే సిగ్గేస్తుంది. టన్నుల కొద్ది టైం ఫోన్ లో మాట్లాడుకున్నా, కిలోమీటర్ల కొద్ది ఎస్.ఎం.ఎస్ లు పంపించుకున్నా రెండు సంవత్సరాల కాలం లో మేము ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా కలుసుకున్నది రెండే రెండు సార్లు. నా పరిస్థితి చూస్తుంటే గోపి గోపిక గోదావరి సినీమాలో "నువ్వక్కడుంటే నేనిక్కడుంటే" పాట జీవితాంతం పాడుకోవాల్సి వచ్చేట్టుంది. దేవుడు మొత్తానికి మా జీవితాలతో ఇండోర్ గేమ్స్, అవుట్ డోర్ గేమ్స్ అనే తేడా లేకుండా అన్ని గేమ్స్ ఆడుకుంటున్నాడు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాము, ఇక నుండి దేవుడిని నమ్ముకోకుండా మమ్మల్ని కలిపిన ఎయిర్ టెల్ నెట్ వర్క్ ని నమ్ముకుందామని.

Tuesday, September 7, 2010

కొడతానంటారా?????????




Empty mind is devils den................

నిన్న కొంచం ఆరోగ్యం బాగా లేకపోవడం తో ఆఫీస్ కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకున్నాను. అసలేం తోచలేదు ఇంటి దగ్గర. పైన చెప్పినట్టు అన్ని పిచ్చి ఆలోచనలే వస్తాయ్ అనుకున్నాను. కాని ఎప్పుడో నేను M.B.A చేసే రోజుల్లో మా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయ్. వాళ్లేపుడు చెప్పే వాళ్ళు "సివిల్స్ ప్రిపేర్ అవ్వరా నువ్, బావుంటుంది" అని. అప్పుడు జోక్ గా తీసుకుని నవ్వి ఊరుకునే వాణ్ని. కాని నిన్న ఎందుకో నవ్వి ఉరుకోవాలనిపించలేదు. ప్రిపేర్ అయి రాస్తే మన సొమ్మేం పోదు కదా అనిపించింది.

మీరు కూడా చెప్పండి, నిజంగా "రాస్తే మన సొమ్మేం పోదు కదా"............
వస్తుందో రాదో నాకు తెలియదు కాని, "రాస్తేనే కదా అసలు తెలిసేది".................
అందుకే సారి సివిల్స్ కి అటెండ్ అవాలని డిసైడ్ అయ్యా.............

అన్నట్టు మీకో విషయం చెప్పడం మరచిపోయా. నా వయసు 26 సంవత్సరాలు. వయస్సు దాటి పోయే లోపు కొడతానంటారా?????????